మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి.
వేటికవే ప్రత్యేకం. ఆ ఆ భాషలు మాట్లాడేవారు కూడా మరీ ప్రత్యేకం.
తమ తమ భాషల పైన, తమ రాష్ట్రాల పైనా వారికుండే ఇది, ఇంచుమించు సమానంగా ఉంటుంది.
కానీ తెలుగు వారు అందుకు విభిన్నం.
చరిత్ర చూస్తే భారతావనిలో మొట్టమొదటి భాషాప్యయుక్త రాష్ట్రం.తెలుగు భాషాభిమానం, జాతి అభిమానంలో కట్టకడస్థానం.
కనపడదెందుకు అరవనాడున వదిలేసిన మన చెన్నపురము
వినపడదెందుకు కరునాడున ప్రభవిల్లే మన తెలుగు స్వరము
మరిచారెందుకు కళింగపాలైన మన జాతి ఖండంము
రాజకీయరక్కసి, అధికారదాహాం, సమైక్యతాలోపం వెరసి
పలు ముక్కలై, చెక్కలై ఇప్పటివరకూ సాధించిందేమిటి
ఇప్పుడు మళ్ళీ అదే గందరగోళ పరిస్థితి
ఇంకెన్ని ముక్కలో తెలియని అనిస్థితి
ఎందుకు నా జాతికే ఈ దౌర్భాగ్యస్థితి
Tuesday, December 8, 2009
Subscribe to:
Post Comments (Atom)
http://uselessnenusytham.blogspot.com/
ReplyDelete